ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చూడండి.... మేమెంతగా ప్రేమించుకుంటున్నామో...  Search similar articles
IVR
WD
"ప్రేమకు హద్దులు లేవు".... ఇదీ ప్రేమికులు చెప్పే మాట. ఇది ప్రేమకా... లేదంటే వారి ప్రవర్తనకా... అంటే ప్రవర్తనకే అని చెప్పాల్సి వచ్చిన దుస్థితి. ఇదివరకటి రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమ భావనలను కేవలం ప్రేమ లేఖల ద్వారా ఒకరికొకరు పంచుకునేవారు. ఒకవేళ వీరిద్దరూ ఎక్కడైనా ఎదురుపడిన సందర్భం వుంటే... ఎదుటపడిన సదరు వ్యక్తి ( ప్రేమికుడు/ ప్రియురాలు) ఎవరో తెలియనట్లు ప్రవర్తించేవారు. ఆ తర్వాత కాలంలోని ప్రేమికులు మూగ సైగలు చేయడం ద్వారా తమ సందేశాన్ని అవతలి వ్యక్తులకు చేరవేయడం జరిగేది.

మరి ఇప్పుడో... బహిరంగంగా పార్కులు, సినిమాలలో షికార్లు. పదుగురుండగానే ఇకఇకలు... పకపకలు. తమ చుట్టు వున్న జనాలే సిగ్గుపడే విధంగా ప్రవర్తనలు. అందరూ తమనే చూస్తున్నా... తమనెవరూ చూడలేదన్న ప్రేమమైకంలో... తమదైన లోకంలో.... విహరించే ప్రేమికులు. ఇటువంటి స్థితి ఇప్పుడు ప్రతి చోటా నెలకొంటోంది. అదేమని ప్రశ్నించినవారికి "ప్రేమను హర్షించలేని వ్యక్తులు"గా ముద్ర.
ప్రేమమైకంలో...
  బహిరంగంగా పార్కులు, సినిమాలలో షికార్లు. పదుగురుండగానే ఇకఇకలు... పకపకలు. తమ చుట్టు వున్న జనాలే సిగ్గుపడే విధంగా ప్రవర్తనలు. అందరూ తమనే చూస్తున్నా... తమనెవరూ చూడలేదన్న ప్రేమమైకంలో... తమదైన లోకంలో.... విహరించే ప్రేమికులు      


ఇటీవల కాలంలో ప్రేమికులు బహిరంగంగా ఎక్కడపడితే అక్కడ తమ ప్రణయకలాపాలను సాగించటం సాధారణమైపోయింది. సభ్యసమాజానికే ఇబ్బందికలిగించే రీతిలో ప్రేమికుల ప్రవర్తన వుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. పోలీసు కంప్లైంట్ ఇవ్వరూ... అదే జరిగింది హనుమకొండలో.

వివరాలలోకి వెళితే... హనుమకొండ- వరంగల్ మార్గమధ్యంలో వున్న వనవిజ్ఞాన కేంద్రానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ సందర్శకులలో ప్రేమ జంటల సంఖ్య ఎక్కువ కావటంతో చిక్కు వచ్చి పడింది. కాలేజీలకు డుమ్మా కొట్టిన కొందరు అబ్బాయిలూ... అమ్మాయిలు ఎంచక్కా వనవిజ్ఞాన కేంద్రంలో బహిరంగ ప్రేమ కార్యకలాపాలు సాగించటం మొదలుపెట్టారు.

నిజమైన సందర్శకులకు ఇది ఇబ్బంది కలిగించడంతో వారు నేరుగా పోలీసులకు హింట్ ఇచ్చారు. అంతే... వనంలో ప్రేమ విరహంలో మునిగితేలుతున్న ప్రేమ పక్షులను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అంతేకాదు వారి మొబైల్ పోన్ల నుంచే నేరుగా వారివారి తల్లిదండ్రులకు ఫోను చేసి విషయాన్నంతా పూసగుచ్చినట్లు చెప్పేశారు. ప్రేమించుకోవటం తప్పుకాదుగానీ... ఇలా పబ్లిక్ ప్లేసుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
యూపీఏకు ఆదికేశవులు మద్దతు ?
మేఘ మథనానికి ఏర్పాట్లు : ప్రభుత్వం
విద్యుత్ రంగాన్ని విస్మరించిన వైఎస్సార్: బాబు
యూపీఏ వైపు 'టైగర్' నరేంద్ర మొగ్గు...!
'చిరు' శిబిరంలో ఏర్పాట్లు ముమ్మరం  
వైఎస్ విధానాల వల్లే విద్యుత్ ఇక్కట్లు : టీడీపీ