ప్రత్యేక తెలంగాణ పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇవ్వడంతోనే యూపీఏకు ఓటు వేస్తున్నట్లు టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్ర పేర్కొన్నారు.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన అనంతరం యూపీఏకు మద్దతు ఇవ్వనున్నట్లు నరేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సోనియా గాంధీ తెలంగాణ అంశంపై సానుకూలంగా స్పందించారని నరేంద్ర అన్నారు.
ఇదిలా ఉండగా యూపీఏకు వ్యతిరేకంగా ఓటువేయాలని తెరాస ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విప్‌ను ధిక్కరిస్తే ఆ బాధ్యత నరేంద్రదేనని తెరాస అధినేత కేసీఆర్ హెచ్చరించారు. అయితే పార్టీ నుంచి బహిష్కరణకు గురై సొంత పార్టీ పెట్టిన తనకు ఈ విప్ వర్తించదని ఆయన తెలిపారు.
|