ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లోక్‌సభలో డబ్బు : విచారణకు బాబు డిమాండ్  Search similar articles
విశ్వాస పరీక్షలో గెలవడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం డబ్బును ఎరవేయడం అత్యంత హేయమైన చర్య అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ జవాబు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కొద్ది సేపట్లో లోక్‌సభలో ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందనగా తమను ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వం డబ్బును ఎరవేసిందని కొందరు ఎంపీలు డబ్బు కట్టలను స్పీకర్ ముందుంచారు. ఈ సంఘటనతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. ఈ హఠాత్పరిమాణంతో లోక్‌సభ స్ధంబించగా స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

ఈ విషయమై న్యూఢిల్లీలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ విశ్వాస పరీక్ష గట్టెక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కార్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. డబ్బు పంపిణీ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా ప్రజల ముందు నిలబెడుతామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని
సోనియా హామీతోనే యూపీఏకు ఓటు : నరేంద్ర
చూడండి.... మేమెంతగా ప్రేమించుకుంటున్నామో...  
యూపీఏకు ఆదికేశవులు మద్దతు ?
మేఘ మథనానికి ఏర్పాట్లు : ప్రభుత్వం
విద్యుత్ రంగాన్ని విస్మరించిన వైఎస్సార్: బాబు
యూపీఏ వైపు 'టైగర్' నరేంద్ర మొగ్గు...!