ఏజెన్సీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించే హక్కు గిరిజనులకు ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున వెల్లడించారు. గిరిజన ప్రాంతంలో వారి మేలుకోసం చేసిన చట్టాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనేతరులు శత్రువులో కాబోరని, వారితో అనవసరంగా గొడవలో పడి కేసులో ఇరుక్కోవద్దని హితవు పలికారు.
గిరిజనుల హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదని, అయితే ఈ చట్టాలను కొందరు స్వార్థపరులు గిరిజనులకు ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి వలలో గిరిజనులు పడవొద్దని నాగార్జున సూచించారు. గిరిజనులు లోకజ్ఞానం పెంచుకోవాలని తమ సంతానాన్ని చదివించాలని ఆయన తెలిపారు. వారికి గల హక్కులను తెలుసుకునేందుకు విద్యాజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని నాగార్జున బోధించారు.
|