ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 27వ తేదీన గాంధీభవన్‌ను సందర్శించనున్నారు. నగర శివార్లలోని బాచుపల్లి వద్ద నేటి (జూలై 23) నుంచి ప్రారంభమౌతోన్న యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశాలలో చివరి రెండు రోజులు రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం జరిగే కార్యక్రమానికి హాజరవుతారని, 27వ తేదీ సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలు దేరుతారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
రాహుల్ గాంధీభవన్ సందర్శనలో భాగంగా, కాంగ్రెస్ కార్యాలయంలో దాదాపు గంటపాటు గడిపి ప్రముఖులతో, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సుమారు ఐదువేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశాలలో భాగంగా 27వ తేదీన జరుగనున్న బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు. డి.శ్రీనివాస్‌లతో పాటు కొందరు మంత్రులు కూడా పాల్గొంటున్నారు.
|