ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సాహిత్యజీవి "హరి" ఇకలేరు!  Search similar articles
సినిమా నిపుణుడు, వామపక్ష సాహిత్య జీవి సూరపనేని హరి పురుషోత్తమరావు (హరి) పరమపదించారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. చాలాకాలంగా హరి అస్వస్థులై ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించే బుధవారం కన్నుమూశారని వారు తెలియజేశారు.

ఆయనకు 70 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్ల క్రితం, హరి ఆయన మిత్రులతో కలిసి "చిలకా గోరింక" చిత్రాన్ని నిర్మించారు. దాశరథి రంగాచార్య రాసిన "చిల్లరదేవుళ్లు" అనే నవల ఆధారంగా అదే పేరుతో తీసిన చిత్రానికి హరి సహదర్శకులుగా పనిచేశారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్‌హౌస్, పెర్‌స్పెక్టివ్స్ వంటి తదితర ప్రచురణ సంస్థలతో హరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.
మరిన్ని
బాబుపై విమర్శలా: జగన్నాథంపై కార్యకర్తల ఆగ్రహం
వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాలి : వైఎస్
చంద్రబాబూ జాగ్రత్త : రఘువీరా
శవంతో మూడురోజులుగా జాగారం
విప్‌ను ధిక్కరించిన వారిపై బహిష్కరణ: బాబు
బలం తగ్గినట్లేనని కాంగ్రెస్ ఒప్పుకోవాల్సిందే!