ఐదురోజుల పాటు విరామం తీసుకున్న "మీకోసం" యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా నుంచి గురువారం యథాతథంగా ప్రారంభం కానుంది. యూపీఏ విశ్వాస పరీక్ష సందర్భంగా హస్తినకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు తన యాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
యూపీఏ ప్రభుత్వంపై విశ్వాసపరీక్ష సందర్భంగా.. సొంతపక్షం నుంచే వెన్నుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు ఏమాత్రం చలించక మళ్లీ యథావిధిగా "మీకోసం" యాత్రను ప్రారంభించనున్నారు. యూపీఏ విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బుధవారం రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
అక్కడ నుంచి "మీకోసం" యాత్ర కోసం నల్లగొండ జిల్లా చౌటుప్పకు వెళ్లిపోయారు. శుక్రవారం వరకు నల్లగొండ జిల్లాలో పర్యటించి, శనివారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఆగస్టు మొదటి తేదీ నుంచి రాయలసీమ పర్యటన ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
|