ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్ పార్టీలో చేరుతా : జయసుధ
త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రంగ ప్రవేశం చేస్తానని ప్రముఖ సినీనటి జయసుధ వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టే సంక్షేమ కార్యక్రమాలతో ఆకర్షితురాలయ్యానని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నట్లు ఆమె తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా సమాజసేవలో నిమగ్నమయ్యాయని, ఈ సేవను మరింత విస్తృత పరిచి ఉన్నత స్థాయిలో నిర్వహించేందుకు గానూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని జయసుధ అన్నారు.

అయితే ఎప్పుడు చేరే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో వివరాలను వెల్లడిస్తానని జయసుధ అన్నారు. వైఎస్సార్‌ను ఇప్పటికే పలుమార్లు కలిశానని, ఆయన కుటుంబంతో ఎప్పటి నుంచి తనకు అనుబంధముందని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా సినీ గ్లామర్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి పార్టీపై జయసుధ స్పందిస్తూ... ప్రతి ఒక్కరికి వారి వారి అభీష్టాల మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, అలాగే చిరంజీవికి కూడా పార్టీ పెట్టే హక్కుందని ఓ వార్తా సంస్థతో చెప్పారు.
మరిన్ని
తెలంగాణాను ఎవ్వరూ అడ్డుకోలేరు : దేవేందర్
జోరుగా దొంగనోట్ల వ్యాపారం  
పరస్పర దాడులకు దారితీసిన ప్రేమవివాహం!
లడ్డూకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
తిరుపతి నుంచే 'చిరు' రైలు ప్రారంభం
సీఎంకు అలాంటి విమర్శలు తగవు : నోముల