కాంగ్రెస్‌పార్టీ నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి ఫ్యాక్స్ మూలంగా తన రాజీనామా లేఖను పంపించారు.
గత కొంత కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జోగయ్యలకు మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... జూబ్లీహిల్స్‌లోని తన పార్టీ కార్యాలయంలో చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పరచి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దీనితో జోగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. తన రాజీనామాకు కారణాలు ఏమిటన్న విషయాలపై సోనియాగాంధీకి పంపినలేఖలో సవివరంగా తెలిపినట్లు జోగయ్య తెలిపారు. చిరంజీవి జరిపిన విలేకరుల సమావేశంలో చాలా చక్కగా సమాధానాలిచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు.
|