ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్
తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంటే ఇంకా చూస్తూ ఊరుకోబోమని నవతెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నేతల పరిచయ కార్యక్రమంలో గౌడ్ మాట్లాడారు.

భావితరాలకు అన్యాయం జరగకముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా పలు సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని దేవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తోందని దేవేందర్ చెప్పారు.

బలమైన పార్టీలు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కునేందుకు తమ పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని దేవేందర్ గౌడ్ అన్నారు. కాగా ఈ నెల 27 వ తేదీన జరుగనున్న పార్టీ బహిరంగ సభకు ఇప్పటి నుండే జన సమీకరణ చేపట్టాలని, జిల్లాల్లో ప్రచారంపై తీసుకునే చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
మరిన్ని
కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్య
అదేమంత గొప్ప పార్టీ కాబోదు : వైఎస్సార్
తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కరిస్తాం: రాజనర్సింహా
బిపిటి బియ్యం రూ.18కే అందజేస్తాం: రోశయ్య
రేపు మీడియా ప్రతినిధులతో చిరు భేటీ
చిరు పార్టీ సునామీయే : జోగయ్య