ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిరు పార్టీ ఆవిర్భావం, కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ ప్రభావం, రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద నష్టాలు తదితర అంశాలను సోనియాగాంధీకి వివరించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

సోనియా గాంధీతో భేటీ అనంతరం సీఎం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...సోనియాగాంధీని రాష్ట్రానికి ఆహ్వానించే విషయమై తాను కలిసానని వివరించారు. కడపజిల్లాలోని నాలెడ్జ్ వ్యాలీలో రాజీవ్ గాంధీ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించే విషయమై ఆమెతో చర్చించామని ముఖ్యమంత్రి తెలిపారు.

అనంతరం తిరుపతిలో జరిగే స్వయం సహాయక సంఘాల సదస్సుకు ఆహ్వానించామని సీఎం చెప్పారు. చిరంజీవి రాజికీయాల్లోకి వచ్చి చేసేదేంలేదని, ఆయన చెప్పినవన్నీ తాము చేసిందేనని వైఎస్సార్ త్రోసిపుచ్చారు.
మరిన్ని
జలయజ్ఞం సఫలీకృతమైంది : పొన్నాల
అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్
కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్య
అదేమంత గొప్ప పార్టీ కాబోదు : వైఎస్సార్
తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కరిస్తాం: రాజనర్సింహా
బిపిటి బియ్యం రూ.18కే అందజేస్తాం: రోశయ్య