ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > "చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!
సినీనటుడు చిరంజీవికి మద్దతుగా ప్రవాస భారతీయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై రోజుల పాటు విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా సుమారు 320 మంది ప్రవాసాంధ్రులు రెండు విమానాల్లో నేడు భాగ్యనగరానికి చేరుకున్నారు.

రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి అధికారికంగా ప్రకటించడంతో ప్రవాసభారతీయులు ఉత్సాహంలో తేలియాడుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి చిరంజీవి తరపున ప్రచారం చేయనున్నారు.

వారికి సోమవారం సాయంత్రం చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ విందు ఇవ్వనున్నారు. అనంతరం ప్రచారం తీరు తెన్నులపై చర్చించనున్నారు. గత ఇరవైరోజులుగా అమెరికాలో చిరంజీవికి మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
మరిన్ని
సినీపరిశ్రమకు చిరు విందు!
సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!
జలయజ్ఞం సఫలీకృతమైంది : పొన్నాల
అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్
కాంగ్రెస్‌కు స్వస్తి... "చిరు"తో దోస్తి! : జోగయ్య
అదేమంత గొప్ప పార్టీ కాబోదు : వైఎస్సార్