తెలుగుదేశం పార్టీలో రాజీనామాల వలసలు విస్తృతంగా కొనసాగుతోంది. గత కొంత కాలంగా వలసలు తగ్గు ముఖం పట్టినా, ఇప్పుడు మళ్లీ మొదలైంది. కాకినాడ టీడీపీ మహిళా మాజీ అధినేత్రి వంగా గీతా తాజాగా సోమవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీలో తనకు ప్రాధాన్యత లేనందువల్లే తాను ఆ పార్టీనుండి వీడిపోతున్నట్లు గీతా వెల్లడించారు. అంతేకాకుండా చిరంజీవి పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.
ఈ మేరకు రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి పంపినట్లు గీతా తెలిపారు. ఇన్నాళ్లుగా తనకు ఆ పార్టీలో సముచిత స్థానమే లభించిందని వంగా గీత మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.
|