ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్య
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్య
WD
రానున్న ఎన్నికల్లో తాను పోటీకి దిగబోనని నర్సాపురం మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన జోగయ్య సోమవారం నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ... పదవీ కాలం పూర్తికాకముందే పార్టీకి పదవికి రాజీనామా చేసినందుకు ప్రజలు తనను మన్నించాలని కోరారు. సినీనటుడు చిరంజీవి పార్టీకి తాను సర్వవిధాలా కృషిచేస్తానని జోగయ్య తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందని, రాష్ట్రంలో ప్రజాసొమ్ము లూటీ అవుతోందని జోగయ్య వెల్లడించారు. అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలగుతున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధాని మన్మోహాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫ్యాక్స్ మూలంగా పంపిచినట్లు ఆయన తెలిపారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
తెదేపాకు వంగాగీత గుడ్‌బై!
"చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!
సినీపరిశ్రమకు చిరు విందు!
సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!
జలయజ్ఞం సఫలీకృతమైంది : పొన్నాల
అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం : దేవేందర్ గౌడ్