ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > "చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావు
ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, కవి కత్తి పద్మారావు సోమవారం చిరంజీవిని కలిసి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి రాజకీయంలో ప్రవేశిస్తునట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఇతర పార్టీల్లో వలసల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వలసలు చేస్తున్న వారందరూ చిరువైపు మొగ్గు చూపుతున్నారు.

ఇందులో భాగంగానే దళిత నాయకుడు కత్తిపద్మారావు తాజాగా చిరుపార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... ఆయన తమ పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ పార్టీ భవితావ్యానికి ఇది ఒక శుభపరిణామమని ఆయన చెప్పారు.

ఇంకా చిరంజీవిని కలిసి మద్దతు తెలిపినవారిలో రాజ్యధికార పార్టీ వ్యవస్తాపకుడు నారగోని, మహాజన్ పార్టీ కార్యదర్శి గౌతమ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి నేతృత్వంలో తమకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నాననికత్తి పద్మారావు విలేకరుల సమక్షంలో వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ హరిరామ జోగయ్య, టీడీపీ మాజీ మహిళా అధ్యక్షురాలు వంగా గీతా రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరారు.
మరిన్ని
అభిమానులుంటే సరిపోదు : ఎర్రన్నాయుడు
ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్య  
తెదేపాకు వంగాగీత గుడ్‌బై!
"చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!
సినీపరిశ్రమకు చిరు విందు!
సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ!