ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారం
సభ్యత్వ నమోదుకు లోక్‌సత్తా మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. లోక్‌సత్తా అనుబంధ సంస్థలైన యువసత్తా, మహిళా సత్తాలు ఈ పర్యటన చేపట్టనున్నాయి. నాలుగు రోజుల పాటు పలు నియోజక వర్గాలు పర్యటించనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు, మద్యంపై మహిళల్లో చైతన్యం, పార్టీ ఎన్నికల ప్రణాళికల్లోని యాభై హామీలపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేపడుతున్నారు.

యువసత్తా బృందానికి దాసరి రత్నం, మహిళా సత్తా బృందానికి ఎన్‌.సరోజాదేవి సారథ్యం వహిస్తారని పార్టీ సంస్థాగత వ్యవహారాల కన్వీనర్‌ బండారు రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ బృందాలు ముందుగా నియోజక వర్గ స్థాయి ప్రచార జట్లకు శిక్షణనిస్తాయి. అనంతరం ప్రచార జట్ల సహకారంతో పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళతాయని కన్వీనర్ తెలిపారు.
మరిన్ని
మెగా 'తీర్థం' పుచ్చుకోనున్న 'జోగి'
"చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావు
అభిమానులుంటే సరిపోదు : ఎర్రన్నాయుడు
ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్య  
తెదేపాకు వంగాగీత గుడ్‌బై!
"చిరు"కు మద్దతుగా ఎన్నారైల ప్రచారం!