ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > బీసీలకు పెద్దపీట వెయ్యండి చూద్దాం: ఎర్రన్న
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బీసీలకు పెద్దపీట వెయ్యండి చూద్దాం: ఎర్రన్న
బడుగు వర్గాలపై అధికార పార్టీకి నిజమైన ప్రేమే ఉన్నట్టయితే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయించండి చూద్దామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత ఎర్రన్నాయుడు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన బడుగువర్గాల మేధోమథన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న 44 మంది ఎంపీలలో 8 మందిని కేంద్ర మంత్రులుగా తీసుకున్నారని, వారిలో ఒక్కరు కూడా బీసీలు లేరని ఆయన స్పష్టం చేశారు.

ఆ పార్టీ వెనుకబడిన వర్గాలపై నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తోందనడానికి ఇది నిదర్శనమని ఎర్రన్నాయుడు ఎత్తి చూపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టి స్వర్గీయ ఎన్టీఆర్ రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. ఆయన నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కేంద్ర ఉద్యోగాల్లో బీసీలకు 27శాతం కోటాను అమలు చేయించారని ఎర్రన్నాయుడు తెలిపారు.

గతంలోనే తాము చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ మంజూరు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని, దానిని సీఎం మళ్లీ తీర్మానం చేస్తామని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రూ.లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఐదుశాతం నిధులను సీఎం రిజర్వేషన్ కేటగిరీల అభివృద్ధికి కేటాయించారని చెప్పారు. గతంలో బీసీలకు తక్కువ నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్లకోసం మాయ మాటలను చెబుతున్నారని ఆయన విమర్శించారు.

అనంతరం తెదేపా మానవ వనరుల విభాగం అధ్యక్షుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనార్టీల మేధోమథన సదస్సులు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చదగని అంశాలను త్వరలో తెలుపుతామని చెప్పారు. ఈ సదస్సుకు అల్లాడి రాజ్ కుమార్, కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు జేఆర్ పుష్పరాజ్ తదితరులు హాజరయ్యారు.
మరిన్ని
రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారం
మెగా 'తీర్థం' పుచ్చుకోనున్న 'జోగి'
"చిరు" తీర్థం పుచ్చుకున్న కత్తిపద్మారావు
అభిమానులుంటే సరిపోదు : ఎర్రన్నాయుడు
ఎన్నికల బరిలోకి దిగను : జోగయ్య  
తెదేపాకు వంగాగీత గుడ్‌బై!