ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > మా స్థాయికి చేరుకోవడం అసాధ్యం: బాబు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మా స్థాయికి చేరుకోవడం అసాధ్యం: బాబు
కొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మమ్మల్ని అందుకోవడం ఎవరితరం కాదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మైదానంలో ఆటగాళ్ళు కొత్తవాళ్ళయినా ప్రజలు పాతవారేనని, వారంత తమ పార్టీ వైపే ఉన్నారని ఆయన చెప్పారు.

కాగా వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టీడీపీ ఉందని, తాము అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆయన వివరించారు. తమ పార్టీ చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోందని, నేతలు విడిపోతున్న ప్రతిసారీ తమపార్టీ మరింత బలోపేతమైందని బాబు వ్యాఖ్యానించారు.

పార్టీలు పెట్టుకునే హక్కు అందరికి ఉందని, వాటి గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని బాబు చెప్పారు. తమ పార్టీ మాత్రం పేదల ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెలుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమాన్నికోరుకుంటున్న చిరంజీవి వ్యాఖ్యలపై స్పందిస్తూ... ప్రజలు తమకు మంచి జరగాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ మోసగించిందని వారు గ్రహించారని బాబు చెప్పారు. కాగా ఎన్టీఆర్ వల్లే రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని ఉద్ఘాటించారు.
మరిన్ని
వెలుగొండ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన సీఎం
ప్రజల్లో లేదు...నేతల్లోనే ఉంది: దేవేందర్
రాజధానికి రావొద్దు: మెగాస్టార్ విజ్ఞప్తి
బీసీలకు పెద్దపీట వెయ్యండి చూద్దాం: ఎర్రన్న
రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారం
మెగా 'తీర్థం' పుచ్చుకోనున్న 'జోగి'