ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > వైఎస్ సర్కారు మరో భూ సంతర్పణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైఎస్ సర్కారు మరో భూ సంతర్పణం
FileFILE
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మరో మారు భూసంతర్పణకు పాల్పడింది. సొంత పార్టీకి అతి తక్కువ ధరకు భూములను కేటాయించింది. ఇది రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు దారితీయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో భూ కేటాయింపులపై వామపక్షాలు భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సొంత పార్టీకి బోయినపల్లిలో కొన్ని ఎకరాల భూములను కేటాయించడం వివాదాస్పందంగా మారింది.

రాజధాని శివారు ప్రాంతాల్లో ఉన్న ఈ స్థలం ధర ప్రస్తుత మార్కెట్‌లో గజ ధర రూ.కోటిపైగా పలుకుతోంది. అయితే కాంగ్రెస్ సర్కారు మాత్రం కేవలం గజం స్థలాన్ని రూ.25 వేలు చొప్పున కేటాయించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సొంత పార్టీ కావడం వల్ల ప్రభుత్వం అతితక్కువ ధరకు భూములను కేటాయించిందని ఆరోపిస్తున్నాయి.

అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని సమర్థించుకుంటోంది. మంచి పనుల నిమిత్తం కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించినట్టు చెపుతోంది. కానీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం భూ కేటాయింపుపై ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
మా స్థాయికి చేరుకోవడం అసాధ్యం: బాబు
వెలుగొండ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన సీఎం
ప్రజల్లో లేదు...నేతల్లోనే ఉంది: దేవేందర్
రాజధానికి రావొద్దు: మెగాస్టార్ విజ్ఞప్తి
బీసీలకు పెద్దపీట వెయ్యండి చూద్దాం: ఎర్రన్న
రాష్ట్ర పర్యటనకు లోక్‌సత్తా శ్రీకారం