మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన సుఖసంతోషాలతో వర్ధిల్లడంతో పాటు లోకకల్యాణార్థం చిరు అభిమానులు లక్ష్మీ నారాయణ యాగం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలోని అన్నమయ్యపురంలో చిరు యూత్ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో కూడా చిరు అభిమానులు చండీయాగాన్ని ఏర్పాటు చేశారు.
యాగం ఏర్పాట్లను కామాక్షి ఆలయ అర్చకులు నటన శాస్త్రి గురుకుల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అభిమాన సంఘాల సమాచారం. ఈ మేరకు నటన శాస్త్రి గురుకుల్ ఆధ్వర్యంలో 50మంది వేదపండితులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చిరు సన్నిహిత వర్గాల సమాచారం.
ఇకపోతే ఈ యాగంలో చిరంజీవి పాల్గొనరన్న విషయం తెలిసిందే. ఈ యాగం లక్ష్మీకటాక్షం, రాజ్యాధికారం కోసం నిర్వహిస్తారు. గతంలో మాజీ ప్రధానులు వాజ్‌పేయి, రాజీవ్ గాంధీకూడా ఈ యాగాన్ని నిర్వహించడం గమనార్హం.
|