ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పోలీసుల నిఘాలో విశాఖ మాన్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పోలీసుల నిఘాలో విశాఖ మాన్యం
ఉగ్రవాదుల ఉనికి కనిపిస్తున్న నేపధ్యంలో పోలీసు బలగాలను విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోకి తరలించారు. దీనితో విశాఖ మన్యం ప్రస్తుతం పోలీసుల నిఘా నీడలో మసలుతోంది. ముఖ్యంగా జీకే వీధి మండలం, చింతపల్లి, కొయ్యూరు, తదితర ప్రాంతాల్లో కూంబింగ్ పెద్దఎత్తున మోహరితమైంది.

గతకొద్ది నెలలకు పూర్వం ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన బలిమెల అడవుల్లో మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో 40మందికిపైగా పోలీసులు మృతిచెందిన సంఘటన తెల్సిందే. అప్పటినుంచి స్తుబ్దుగా ఉన్న పోలీసుల్లో తిరిగి కదలికలు కనిపిస్తోంది.

మావోయిస్టులు ఇటీవలి కాలంలో వరుసదాడులకు పాల్పడడం, కాఫీ తోటలను అక్రమించడం లాంటివి చేయడంతో పోలీసులు అప్రమత్తులైయ్యారు. విశాఖ మాన్యంలోకి ప్రత్యేక పోలీసు సిబ్బందిని తరలించి మావోయిస్టుల గాలింపు చర్యలను చేపడుతున్నారు. వీరు విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవి ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించారు. అటవిప్రాంతాల్ని క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
31న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సీఎం
బీసీల రిజర్వేషన్లను ఆమోదించిన అసెంబ్లీ
ఒకటిన తెదేపా తెలంగాణ కమిటీ భేటీ
సర్పంచ్‌లకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: టీడీపీ
వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టు