ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > సీపీడీసీఎల్ ట్రాన్స్‌కోలో పెను అగ్నిప్రమాదం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీపీడీసీఎల్ ట్రాన్స్‌కోలో పెను అగ్నిప్రమాదం
భాగ్యనగరంలోని ట్రాన్స్‌కో గోడౌన్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంవల్ల ఆస్తి నష్టం కలిగిన వాటిపై పూర్వాపరాలు ఇంకా తెలియరాలేదు.

ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు పదికిపైగా అగ్నిమాపక సిబ్బింది రంగంలోకి దిగారు. ట్రాన్స్‌‌కో గోడౌన్‌లో మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ గోడౌన్ ఉన్న మోతీనగర్ కాలనీ వాసులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. గోడౌన్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు పేలతాయన్న పుకార్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అలాంటి ప్రమాదాలు జరుగవని సంబంధిత అధికారులు హామీ ఇస్తున్నా, ప్రజలు మాత్రం ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు.
మరిన్ని
నల్లకుంట హత్య కేసు : నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష
తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వారే...!: సీఎం
ప్రజారాజ్యం గూటికి చేరిన తమ్మినేని
కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు : జీవన్‌రెడ్డి
దేవేందర్ గౌడ్ "ఆత్మగౌరవ యాత్ర" ప్రారంభం
కొల్లేరు పరిధిపై సభలో తీర్మానం: వాయిదా