వరంగల్ జిల్లాలో గురువారం పదిమంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పదిమందిలో ముగ్గురు ప్రజా ప్రతినిధుల యాక్షన్ టీమ్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు వీరి నుంచి 14 ఆయుధాలు, 1200 తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరాలందించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు ఇటీవల పంజా విసిరిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు చేసిన ఈ దాడిలో సుమారు 50 మంది ఆచూకీ తెలియరాలేదు. 64మందితో కూడిన లాంచి ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లాలో ఉన్న బల్లిమెల్ల రిజర్వాయర్‌ను దాటుతున్న సమయంలో మావోయిస్టులు దాడికి పాల్పడిన సంగతి విదితమే.
|