మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వలసల వెల్లువ రోజు రోజుకు అధికమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం చిరంజీవి పార్టీలో చేరగా, తాజాగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, తెదేపా బండారు సత్యానందరావు చిరు పార్టీలో చేరనున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి ఆయన ప్రజారాజ్యం పార్టీ గూటిలో చేరనున్నారు. చిరంజీవి పార్టీలో చేరేముందు సత్యానందరావు టీడీపీకి రాజీనామా లేఖను పంపిచనున్నారని సన్నిహితుల సమాచారం.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ... సత్యానందరావు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|