ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చిరంజీవిని లాగడంలో అర్థం లేదు : నళిని
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరంజీవిని లాగడంలో అర్థం లేదు : నళిని
తన వివాహ వివాదంలో ప్రజాపార్టీ అధినేత చిరంజీవిని లాగడంలో అర్థం లేదని పద్మారావు కోడలు నళిని స్పష్టం చేశారు. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని నళిని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎవరో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు.

తల్లిదండ్రులతో కలిసి ఉండటం తనకిష్టం లేదని నళిని కుండబద్దలు చేశారు. తనపై ప్రేమ ఉంటే వారే తన వద్దకు రావొచ్చునని, తన కోసం చిరంజీవి పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులను నళిని కోరారు.

ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రమేయంతో తమ కూతురికి బలవంతంగా పెళ్లి చేశారని నళిని తల్లిదండ్రులు టి.సుబ్బారావు, మణి దంపతులు గురువారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమ కూతుర్ని అప్పగించని పక్షంలో చిరంజీవి పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

ఇకపోతే... తమ్మిన సుబ్బారావు కుమార్తె అయిన నళినితో కత్తి పద్మారావు కుమారుడు వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కులాంతర వివాహంగా పలువురు ప్రముఖల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశ్వీరదించారు.
మరిన్ని
ఎన్నికల తర్వాతే ప్రత్యేక రాష్ట్రం: కేసీఆర్
విద్యుత్ కోతపై సభలో చర్చ: విపక్షాల వాకౌట్
'చిరు' పార్టీ తీర్థం పుచ్చుకోనున్న బండారు
రానున్న ఎన్నికలలో ఒంటరి పోరు: ప్రజారాజ్యం
ఓ ప్రేమ వివాహం : వివాదంలో చిరంజీవి
పదిమంది మావోయిస్టుల అరెస్టు!