కాంగ్రెస్ పార్టీపై చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభావం ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తమ పార్టీ ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు.
తమ పార్టీ చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయిందని ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. తాము అధికారంలో ఉండగా మరో రాజకీయ పార్టీకి ఏ మాత్రం స్థానం లేదని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీకి తమ్మినేని సీతారాం తాజాగా రాజీనామాపై మీ అభిప్రాయమేమని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.
|