వర్షాకాల సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ కోతపై విపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశం ఈ రోజు ప్రారంభం కాగానే విద్యుత్ కోత సమస్యపై ప్రభుత్వ వైఖరిపట్ల విపక్షాలు అభ్యంతరం చేసింది.
తొలుతగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ జంటనగరాల్లో విద్యుత్ కోతపై ప్రశ్న లేవనెత్తారు. దీనికి విద్యుత్‌శాఖ మంత్రి షబ్బీర్‌అలీ మాట్లాడుతూ... విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ సమాధానానికి తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... మా హాయాంలో రైతన్నలకు తొమ్మిదిగంటల పాటు విద్యుత్ అందించామన్నారు. కాని ఇప్పుడు ఏడుగంటలకే విద్యుత్ సరఫరాను అందించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనికి సీఎం సమాధానమిస్తూ... తెదేపా హాయాంలో తొమ్మిదిగంటలు విద్యుత్ సరఫరా చేసి ఎక్కువ ఖర్చు చేసిందని, తమ పాలనలో ఏడుగంటల పాటు విద్యుత్ అందించడం ద్వారా తక్కువ ఖర్చవుతునట్టు వివరించారు.
|