చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి తెలుగుదేశం పార్టీని ఓడించే సత్తా లేదని శుక్రవారం తెదేపా నాయకుడు ఎర్రన్నాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించగలగడం ఖాయమని ఎర్రన్నాయుడు జోస్యం చెప్పారు
ప్రతిపక్ష స్థానం ప్రజలే నిర్ణయిస్తారని ప్రజారాజ్యం పార్టీ అధికారప్రతినిధి మిత్రా వ్యాఖ్యలపై ఎర్రన్నాయుడు మండిపడ్డారు. ఇటీవల రాజకీయాల్లోకి అడుగిడిన ప్రజారాజ్యం పార్టీకి తమను ఓడించే సత్తాలేదని ఆయన స్పష్టం చేశారు.
వివిధ పార్టీలనుండి వలస వస్తున్న నాయకులను అక్కునచేర్చుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నించడం కుదిరేపని కాదని ఎర్రన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంలో పార్టీకి రాజీనామా చేసిన తమ్మినేని సీతారాంపై స్పందిస్తూ.... తన వైఖరిపై విసుకుచెంది ప్రజారాజ్యంపార్టీలో చేరానని తమ్మినేని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎర్రన్నాయుడు చెప్పారు.
|