మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్రజారాజ్యం పార్టీతో దోస్తి కట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాది పార్టీ నాయకుడు అమర్‌సింగ్ తెలిపినట్లు విశ్వసనీయుల సమాచారం.
కాగా ప్రజారాజ్యం పార్టీతో దోస్తి చేసే విషయంపై సమాజ్‌వాది పార్టీ నేతలు జయాబచ్చన్, జయప్రదలతో కలిసి ఈ నెల ఏడో తేదీన ఆ పార్టీ అధినేత చిరంజీవితో చర్చించనున్నట్లు సమాచారం.
అనంతరం రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు చిరంజీవి పార్టీ తరపున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను పర్యటించి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తారని అమర్‌సింగ్ చెప్పారు. చిరంజీవి పార్టీ విధి విధానాలను, లక్ష్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళతారని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.
|