ఉపాధ్యాయుల డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ... భవిష్యత్ అంతా ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా ఉపాధ్యాయుల సమస్యలను అతిత్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరంనుంచి ఉపాధ్యాయుల సర్వీసులను పరిగణలోకి తీసుకుని వారికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్ఢులను బహుకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం ఏకీకృత సర్వీసు రూల్స్‌ను సాధించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంలో సీఎం చెప్పారు.
మరోవైపు మరో ఐదు సంవత్సరాలపాటు ఉచితవిద్యుత్ అందిస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సభలో ఈ రోజు విద్యుత్ సమస్యపై విపక్షాలు లేవనెత్తిన సమాధానానికి ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. గృహ అవసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు పెంచబోమని సీఎం హామీ ఇచ్చారు.
|