వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చిరంజీవి ప్రకటించడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవన్నీ పగటి కలలు మాత్రమేనని ఆయన అన్నారు. ఎంతమంది వచ్చినా ప్రజలు తమవైపే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతిస్థానాన్ని 20వేల మెజార్టీతో గెలుస్తామని ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు ప్రకటించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రెండు జిల్లాల్లో గెలుస్తామంటే మిగతా వాటిల్లో గెలువలేమని వారే స్పష్టం చేసినట్టైందని అన్నారు.
కాగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ వైఖరి అప్రజాస్వామ్యంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని బాబు విమర్శించారు.
|