గురువు దేవునితో సమానమని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆయన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ... తల్లిదండ్రులు జన్మనిస్తే... గురువు సమాజంలో ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుతారని ఆయన చెప్పారు.
తాను అనునిత్యం విద్యార్థినేనని, ఈ సందర్భంగా గురువునకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చిరంజీవి తెలిపారు. తాను చిన్న వయస్సు మొగల్తూరులో విద్యాబుద్ధులు చెప్పిన గురువు ఆజీజ్ మహ్మద్ ఉస్మానీ అని ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.
అనంతరం ఆజీజ్ మహ్మద్ ఉస్మానీ మాట్లాడుతూ... చిరంజీవి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్నత పదవులకు ఎదగాలని ఆయన ఆశీర్వదించారు. వరకట్నాన్ని రూపుమాపాలని, లంచగొండితనాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన చిరంజీవికి విజ్ఞప్తి చేశారు.
|