ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > "మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా
మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఆవిర్భావ సభ "ఠాగూర్" సినిమాలా ఉంటుందనుకుంటే "మృగరాజు" చిత్రంలా ముగిసిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ఎద్దేవా చేశారు. సేవ ముసుగులో చిరంజీవి రాజకీయాల్లోకి రావడం హాస్యాస్పదమని, సినీ కళాకారులను చిరంజీవి ఏనాడు ఆదుకున్న ప్రసక్తే లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చిరంజీవి పార్టీ పెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, తమ కుమార్తె నళిని విషయంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కత్తిపద్మారావులపై చర్య తీసుకోవాలని కోరుతూ నళిని తల్లిదండ్రులు ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
మరిన్ని
గురువు దేవునితో సమానం : చిరంజీవి
వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్
అవన్నీ పగటి కలలే: చంద్రబాబు
ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరిస్తాం: వైఎస్
ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాదీ మద్దతు
తెదేపాను ఓడించే సత్తా పీఆర్పీకి లేదు: ఎర్రన్నాయుడు