తమ కూతురును అపహరించి బలవంతంగా పెళ్ళి చేశారని ఆరోపింస్తూ... నళిని తల్లిదండ్రులు తమ్మిన సుబ్బారావు, నాగశిరోమణి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై కేసుపెట్టారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్‌లో శనివారం నళిని తల్లిదండ్రులు ఈ మేరకు పీర్యాదు చేశారు.
తనను గృహంలో నిర్భందించి తమ కుమార్తెను బలవంతంగా తీసుకేళ్ళి పెళ్లి చేయించారని వారు ఫీర్యాదు లేఖలో పేర్కొన్నారు. కాగా పోలీసులు చిరంజీవిపై కిడ్నాప్, గృహనిర్భందం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నళినిభర్త చేతన్, మామ కత్తి పద్మారావులపై కూడా కేసుపెట్టారు. వీరిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
|