ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
2009 ఏప్రిల్ నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. 010 ద్వారా వేతనాలతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం పంచాయతీ రాజ్ ఉద్యోగులు శనివారం నుంచి నిరవధిక సమ్మెను చేపట్టిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీని ఆర్థిక మంత్రి రోశయ్య శాసనసభలో ప్రకటించారు. దీంతో పాటు వీరికి నెల నెలా వేతనాలు అందేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రోశయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని
హజ్ యాత్రికుల యూజర్ ఛార్జీలపై సభలో రభస
చిరంజీవిపై కేసు నమోదు
"మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా
గురువు దేవునితో సమానం : చిరంజీవి
వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్
అవన్నీ పగటి కలలే: చంద్రబాబు