ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుండానే దేవాదుల పైపులు లీకేజీలు రావడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం దేవాదుల పైపుల లీకేజీలపై సభలో వాడీవేడీ చర్చలు జరిగింది. దీనిపై శ్రీహరి ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదని శ్రీహరి ఆరోపించారు. నిర్మాణన పనుల్లో ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించదలిస్తే వెంటనే సంబందిత కాంట్రెక్ట్‌ర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని శ్రీహరి డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మించడానికి ప్రభుత్వం అదనంగా రూ.125 కోట్లును కాంట్రాక్టర్లకు అప్పగించిందని ఆయన విమర్శించారు. కాగా ప్రాజెక్ట్ నిర్మాణంవల్ల ఒక్క ఎకరాకి కూడా అదనంగా సాగునీరును అందించడంలేదని ఆయన ఆరోపించారు. ఆయకట్లు స్థిరీకరణలో భాగంగానే పంటపోలాలకు నీరు అందుతోందని శ్రీహరి వివరించారు.

ఈ నేపథ్యంలో పైప్‌లైన్‌లోని లోపాల విచారణకు ప్రభుత్వం సిద్ధంకావాలని శ్రీహరి సవాల్ విసిరారు. దీనికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి పొ్న్నాల లక్ష్మయ్య సమాధానమిస్తూ...దేవాదుల ప్రాజెక్టుల్లో పైప్‌లైన్ లీకేజీలు కాంట్రాక్టర్ల తప్పిదాలు కాదని, సాంకేతికలోపమే కారణమని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రభుత్వ సమాధానానికి విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
మరిన్ని
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
హజ్ యాత్రికుల యూజర్ ఛార్జీలపై సభలో రభస
చిరంజీవిపై కేసు నమోదు
"మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా
గురువు దేవునితో సమానం : చిరంజీవి
వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్