ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
సినీ గ్లామర్‌కు ఓట్లు రాలబోవని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... పార్టీ సిద్ధాంతాలను చూసి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారని తెలిపారు.

చిరంజీవి, బాలకృష్ణ, బిగ్‌ బీ అమితాబ్‌లను చూసి ప్రజలు ఓట్లు వేయరని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కొల్లేరు ప్రాంతంలోని చేపల చెరువుల వ్యాపారస్తులకు అమ్ముడుపోయారని నారాయణ ఆరోపించారు.

కాగా కొల్లేరు సరస్సు కుందింపును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బడా వ్యపారవేత్తలకు లాభాలు తెచ్చి పెట్టేందుకే ప్రభుత్వం కోస్తా కారిడార్ నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం పాలనలో ప్రాజెక్టులన్ని అవినీతితో కూడినవని, ఇటీవల కురిసిన వర్షాలకు పలు ఆనకట్టలకు గండ్లు పడడం ఇందుకు పరాకాష్టగా నిలుస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
మరిన్ని
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
హజ్ యాత్రికుల యూజర్ ఛార్జీలపై సభలో రభస
చిరంజీవిపై కేసు నమోదు
"మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా
గురువు దేవునితో సమానం : చిరంజీవి