ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కడియం శ్రీహరి ఎంపికయ్యారు. పార్టీ కార్యదర్శిగా తలసాని శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు. టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న దేవేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయడంతో తెదేపా ఆ స్థానంలో కొత్తవారిని నియమించింది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును లక్ష్యంగా చేసుకుని దేవేందర్ గౌడ్ తెదేపాకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నవ తెలంగాణా ప్రజా పార్టీని దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణా ఆత్మగౌరవ యాత్రను గురువారం నుంచి ప్రారంభించారు. వికారాబాద్‌లో ప్రారంభమైన ఈ ఆత్మగౌరవ యాత్ర అక్టోబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో ధర్నా, శాంతియాత్రతో పూర్తి కానుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
మరిన్ని
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
హజ్ యాత్రికుల యూజర్ ఛార్జీలపై సభలో రభస
చిరంజీవిపై కేసు నమోదు
"మృగరాజు" సినిమాలా ముగిసింది : రోజా ఎద్దేవా