ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > శాసనసభ నిరవధిక వాయిదా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శాసనసభ నిరవధిక వాయిదా
వర్షాకాల సమావేశాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శనివారం సభలో వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరం మధ్యాహ్నం సభ వాయిదా పడింది. అంతకుమందు దేవాదుల సాగునీటి ప్రాజెక్ట్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ విపక్షాలు ఆరోపణల వర్షం కురిపించగా ప్రభుత్వం వాటిని త్రోసిపుచ్చింది.

తదనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని విపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. దీనికి సంబంధిత మంత్రి స్పందిస్తూ.... ఇది రాష్ట్ర పరిధిలోని సంబంధించిన అంశంకాదని చెప్పారు.

దీనిపై సివిల్ ఏవియేషన్ మినిస్ట్రితో పాటు జీఎంఆర్ సంస్థతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అంశమని మంత్రి వివరించారు. హజ్ యాత్రికులకు యూజర్ ఛార్జీలపై మినహాయింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. యూజర్ ఛార్జీల వసూలుపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. వీరి ప్రతిపాధనను స్పీకర్ తీరస్కరించారు.
మరిన్ని
టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం
హజ్ యాత్రికుల యూజర్ ఛార్జీలపై సభలో రభస
చిరంజీవిపై కేసు నమోదు