ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > టీచర్లకు 46శాతం మధ్యాంతర భృతి : బాబు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టీచర్లకు 46శాతం మధ్యాంతర భృతి : బాబు
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు దాదాపు 46 శాతం మధ్యాంతర భృతిని ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్త సవరణ కమీషన్ వేస్తామని బాబు పునరుద్ఘాటించారు. వారికీ ఉచితంగా ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారు.

ఉపాధ్యాయులు పదవి విరమణ చేసేలోపు ఇంటిని నిర్మించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని బాబు ఈ సందర్భంలో వెల్లడించారు. ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని, వారి డిమాండ్లను పరిష్కరించడంపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ నేపధ్యంలో మీరు ఇంట్లో కూర్చుంటే వీలుకాదని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మరిన్ని
పాస్‌పోర్ట్ నిబంధనలు సవరించండి: లగడపాటి
శాసనసభ నిరవధిక వాయిదా
టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి
పీఆర్ ఉద్యోగులకు వేతనాలు : ప్రభుత్వం