ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > విపక్షాల వైఖరిపై రోశయ్య ఆందోళన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విపక్షాల వైఖరిపై రోశయ్య ఆందోళన
వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ఆర్థిక మంత్రి, అసెంబ్లీ సభావ్యవహారాల ఇన్‌ఛార్జ్ రోశయ్య ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల తీరుపై రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.

సభ నిబంధనలకు వ్యతిరేకంగా తాము చెప్పిందే జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టుతోందని తెలిపారు. స్పీకర్ సురేష్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సంస్కారమనిపించుకోదని విపక్షాలపై రోశయ్య ధ్వజమెత్తారు. దేశంలోనే పరిణతి గడించిన స్పీకర్‌గా సురేష్‌రెడ్డి పేరు పొందారని రోశయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అలాంటి స్పీకర్‌ను అనవసరంగా వివాదాల్లోకి లాగి అవమానపరచాలని కొన్ని పార్టీలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయని రోశయ్య ఆరోపించారు. అసలైన సమస్యలను చర్చలకు రానీయకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆర్థిక మంత్రి విరుచుకుపడ్డారు. తాము చెప్పిందే వేదమనే ధోరణిలో ప్రవర్తిస్తున్నాయని రోశయ్య వ్యాఖ్యానించారు.
మరిన్ని
టీచర్లకు 46శాతం మధ్యాంతర భృతి : బాబు
పాస్‌పోర్ట్ నిబంధనలు సవరించండి: లగడపాటి
శాసనసభ నిరవధిక వాయిదా
టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...
పైపుల లీకేజీలు ప్రభుత్వ అవినీతికి నిదర్శనం : శ్రీహరి