ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > చంద్రబాబుతో ఎన్టీఆర్ వారసుల భేటీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చంద్రబాబుతో ఎన్టీఆర్ వారసుల భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు ఆరాధ్య నటుడు దివంగత ఎన్టీరామారావు నట వారసులు ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. యువరత్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో పాటు.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి హరికృష్ణలు ఆదివారం ఉదయాన్నే తెదేపా అధినేత నివాసానికి విచ్చేశారు.

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేసిన దరిమిలా నందమూరి నట వంశాన్ని కూడా ఆ రంగంలోకి దించాలని తెదేపా నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి పార్టీ ఏర్పాటు వల్ల తెదేపాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చిపెట్టేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ఇందులోభాగంగానే ఆయన నందమూరి వారసులను తన ఇంటికి అహ్వానించి చర్చలు జరుపుతున్నారు. అయితే కేవలం మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు తెదేపాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఇప్పటికే సమ్మతించిన విషయం తెల్సిందే.
మరిన్ని
విపక్షాల వైఖరిపై రోశయ్య ఆందోళన
టీచర్లకు 46శాతం మధ్యాంతర భృతి : బాబు
పాస్‌పోర్ట్ నిబంధనలు సవరించండి: లగడపాటి
శాసనసభ నిరవధిక వాయిదా
టీడీఎల్పీ ఉపనేతగా కడియం శ్రీహరి
నటులైతే మాత్రం ఓట్లు పడతాయా...