సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవితో సమావాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత అమర్ సింగ్ ఆదివారం సాయంత్రం భేటీ కానున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న అమర్ సింగ్.. తాజాగా ప్రజారాజ్యం పార్టీ అధినేతతో భేటీ కోసం రాష్ట్ర రాజధానికి వస్తుండటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్న ఎస్పీ.. రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కూడా తమ పట్టు పెంచుకోవాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. తదనుగుణంగా పావులు కదుపుతున్నారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రం ఈ భేటీకి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కేవలం చిరంజీవిని అభినందించేందుకు మాత్రమే అమర్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నారని చెపుతున్నారు. ఇదిలావుండగా సాయంత్రం చిరంజీవి నివాసంలో జరిగే సమావేశంలో అమర్ సింగ్‌తో పాటు ఒకనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ నటి జయాబచ్చన్ కూడా పాల్గొంటున్నారు.
|