కొల్లేరు సరస్సులో ఎల్లవేళలా నీరు ఉండాలంటే ఉప్పుటేరు వాగుపై రెగ్యులేటరీ నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అలాగే.. కొల్లేరు సరస్సు పరిశుభ్రం పనులను ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలావుండగా కొల్లేరు అపహరణ విస్తీర్ణం తగ్గింపు వ్యవహారం అటు రాజకీయాల్లోను, ఇటు నిపుణుల్లోను పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ విస్తీర్ణ తగ్గింపును సుప్రీం కోర్టు లేదా సాధికారిక సంఘం గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరిచబోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు సరస్సు అపహరణ విస్తీర్ణానాన్ని ఐదో కాంటూరు నుంచి మూడు కాంటురుకు తగ్గించడం రాజకీయ లబ్దికోసమేనని పలువురు పేర్కొంటున్నారు.
|