రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలే తమ పార్టీ ఎజెండాగా ఉంటాయని ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం తనను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు హైదరాబాద్‌కు తరలి వచ్చారు.
వీరిని మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని జిల్లాల పర్యటన చేపడుతానని, ఆ సమయంలో ప్రజల కష్ట సుఖాలు తెలుకుంటానని తెలిపారు.
ప్రజారాజ్య పార్టీ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తుందని చిరంజీవి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల ఆవసరాలు, కోరికలే తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని తాను తెల్లకాగింతం లాంటి వాడినని, ఆ కాగితంపై ఎవరైనా ఎలాగైనా రాసుకోవచ్చని చిరంజీవి అన్నారు.
|