మెగాస్టార్ చిరంజీవిని తాము ఎంతగానో అభిమానిస్తామనీ... కనుకనే ఆయనను కలిసేందుకు వచ్చామని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ తెలిపారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సినిమాల్లో పలు పాత్రలు పోషించిన మెగాస్టార్, నిజజీవితంలో కూడా హీరో పాత్రలను పోషించాలని ఆయన ఆకాంక్షించారు.
ఎస్పీ పార్టీ నేత అమర్‌సింగ్, ఎంపీలు జయప్రద, జయాబచ్చన్‌లు ఆదివారం సాయంత్రం ప్రజారాజ్యం కార్యాలయంలో చిరంజీవిని కలుసుకున్నారు. పొత్తులకు సంబంధించి చిరంజీవితో ఎలాంటి చర్చలు జరుపలేదని ఆయన అన్నారు. "చిరు"పై అభిమానం, ఆయన కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయనను కలిశామని చెప్పారు.
అమితాబ్ కుటుంబానికి చిరు చిరకాల మిత్రుడని ఆయన తెలిపారు. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిసి అమితాబ్ దంపతులు తిరుపతి సభకు వెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే కుదరలేదని చెప్పారు.
|