మెగాస్టార్ చిరంజీవికి తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ప్రముఖ నటి, ఎస్పీ ఎంపీ జయప్రద స్పష్టం చేశారు. చిరంజీవి స్థాపించిన "ప్రజారాజ్యం" పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ వచ్చే ఎన్నికల్లో మద్దతునిస్తుందని మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా విజయబావుటా ఎగురవేసిన చిరంజీవి, రాజకీయాల్లోనూ మెగాస్టార్‌గా తన హవాను కొనసాగిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించే సత్తా చిరంజీవికి ఉందని ఈ సందర్భంగా జయప్రద విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, ఎస్పీ సీనియర్ నేత అమర్‌సింగ్, ఎంపీలు జయప్రద, జయాబచ్చన్‌లు చిరంజీవిని ఆయన నివాసంలో ఆదివారం కలుసుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తాము ఎన్నికల పొత్తుపై చర్చలు జరుపలేదని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే ఆయను స్వయంగా కలిసి అభినందించినట్టు చెప్పారు.
|