భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) ఎవరితో పొత్తు కుదుర్చుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లబోదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 'ప్రజారాజ్యం' పార్టీతో సీపీఎం పొత్తు పెట్టుకున్నా తమ పార్టీకి నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా సీపీఎం తాజాగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం పట్ల ముఖ్యమంత్రి మండిపడ్డారు. పార్టీ పరంగా సీపీఎంకు మామీద కోపం ఉంటే ఉండవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్ళ పాలనలో తెలుగుదేశం పార్టీ ఏం చేశారని, వారు ఆ పార్టీతో జత కడుతారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం గుర్తు చేశారు. దీనిని కామ్రేడ్ రాఘవులు విస్మరించారని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో రాఘవులు తమపై విమర్శలు చేయడం భావ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు.
|