రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాల ఎరువులను అధికారులు పట్టివేశారు.
విశాఖ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మూడొందల యూరియా బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో మల్లంపేట నుంచి చెన్నైకు తరలిస్తున్న 136 ఎరువుల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఎరువుల గోడౌన్‌పై తాజాగా రైతులు దాడి చేసి ఎరువుల లూటీకి పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మనుగోలులో రైతులు ఈ రోజు ఉదయం ఎరువుల లారీపై దాడి చేసి దాదాపు 420 బస్తాల ఎరువు బస్తాలను తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎరువుల గోడౌన్‌పై అన్నదాతలు డాడిచేసి సుమారు 300 బస్తాల ఎరువులను లూటీ చేశారు.
|