ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఎరువుల గోదాములపై రైతుల దాడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎరువుల గోదాములపై రైతుల దాడి
ఎరువుల కొరతతో రైతన్నల ఆగ్రహం రోజురోజుకి పెచ్చరిల్లుతోంది. ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరతపై అన్నదాతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు గుమిగూడారు. చివరకు అధికారులు ఎరువులను ఇతర గ్రామాలకు తరలిస్తుండడంతో రైతులు కోపోద్రిక్తులై రైతుసేవా కేంద్రంపై దాడిచేసి ఎరువులను లూటీ చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సేవా కేంద్రం వద్దకు చేరుకుని అన్నదాతలపై లాఠీ ఛార్జీ ప్రయోగించారు. దీనితో పలువురి రైతులకు గాయాలయ్యాయి.

మరోవైపు గుంటూరు జిల్లా నకిరెకల్‌లో ఎరువుల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారిపై మహిళా రైతులు దాడికి చేయడంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : సీఎం
తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
మహాకూటమి ఏర్పాటు అసాధ్యం : నారాయణ
ఆర్థిక పరిస్థితి భ్రష్టుపటింది : బాబు
చంద్రయాన్ ప్రయోగంపై కసరత్తు
తెలంగాణ వాదులారా... ఏకమవుదాం : గౌడ్